Thursday, October 6, 2016

అనంతపురము జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి గారు,మరియు జిల్లా మలేరియా అధికారి గారి ఉత్తర్వుల మేరకు చుక్కలూరు పారిశ్రామిక వాడ నందు ఉన్న నీటి గుంటలు దోమల అభివృద్దికి దోహదపడుతూ తద్వారా మలేరియా,డెంగు లాంటి జ్వరములు వ్యాపింప చేసే ప్రమాదము ఉన్నందున తక్షణ నివారణ చర్యలు చేపట్టి వేస్ట్ ఆయిల్ సేకరించి మురుగు నీటిగుంతల యందు చల్లడం జరిగినది.నీటిగుంతల యందు గంబుసియా ఫిష్ విడుదల చేసి దోమ లార్వా నిర్మూలన చర్యలు చేపట్టడమైనది. యాంటి లార్వా యాక్టివిటీస్ నందు గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ ను భాగస్వామ్యులుగా చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రాణాంతక వ్యాదుల వ్యాప్తిని అరికట్టుటకు చేపట్ట వలసిన అన్ని నివారణ చర్యలు తీసుకోవటం జరుగుచున్నది.



చుక్కలూరు గ్రానైట్ పారిశ్రామిక వాడ నందు జ్వర పీడితులకు

రక్త పరీక్షలు చేసి తక్షణం మందులు పంపిణీ చేయడం జరిగినది.
దోమల నివారణకు ప్రత్యేక కార్య చరణ ప్రణాళిక రూపొందించి
ప్రాణాంతక దోమకాటు వ్యాదుల నివారణకు కృషి చేయటం జరిగింది.
ఈ కార్య క్రమం నందు చుక్కలూరు ఆసుపత్రి హెల్త్ సూపర్వైసర్, షబ్బీర్ అహమ్మద్,తాడిపత్రి NMEP సబ్ యూనిట్ నందు పనిచేయు 
ఆరోగ్య కార్యకర్తలు సర్మాస్ వలి,
మరియు అరుణోదయ కుమార్ పాల్గొన్నారు.







No comments:

Post a Comment