Sunday, November 17, 2019

వేడుకగా బాలల దినోత్సవ నిర్వహించుకున్న తాడిపత్రి మండల ప్రజలు!!

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్న తాడిపత్రి మండల ప్రజలు!!
నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా చుక్కలూరు ఎస్సీ బాలుర వసతిగృహం నందు 79 మంది విద్యార్థులకు చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెహనా సుల్తానా గారు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత,దోమకాటు వ్యాధులనుండి రక్షణ, సీజనల్ డిసీజెస్ నుండి కాపాడుకొనుట, పోషకాహారం తీసుకోవటంలో మెలకువలు వీటి గురించిన ఆరోగ్య విద్య పైన హాస్టల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కృష్ణ మోహన్ బాబు, లక్ష్మీదేవి మరియు ల్యాబ్ టెక్నీషియన్ జ్యోతి పాల్గొన్నారు.


1 comment:

  1. Hey thank you!!! I was seeking for the particular information for long time. Good Luck ?

    ReplyDelete