Sunday, November 24, 2019

గర్భిణులు, చిన్నపిల్లలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని తాడిపత్రి మండల ఆరోగ్య విస్తరణ అధికారి బాల సూర్య నారాయణ అన్నారు. శని వారం మధ్యాహ్నం ఆయన చుక్కలూరు పీహెచ్‌సీ పరిధిలోని సజ్జలదిన్నె అంగన్వాడి కేంద్రము సందర్శించారు. ఆయా అంగన్వాడి కేంద్రాల్లో దస్త్రాలు, మాతాశిశు సంరక్షణ కార్డులను పరిశీలించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు ఇమ్యునైజేషన్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించి, తగిన సూచనలు చేశారు. ఈ కార్య క్రమంలో సూపర్‌వైజర్‌ కృష్ణ మోహన్, వైద్య సిబ్బంది,ఆశ మరియు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.


1 comment: