Sunday, October 13, 2013

వర్షాకాలం..వ్యాదుల సీజన్‌ - పలు రకాల జాగ్రత్తలు



 వర్షాకాలం వర్షాలు కురవటం మొదలైతే వాతవరణం చల్లబడుతోంది. వాతవరణం చల్లబడితే ప్రజల ఆరోగ్యం చెడిపోయి అనారోగ్యం వెంటాడుతోంది. అందుకే వర్షాకాలాన్ని అందరు వ్యాదుల సీజన్‌గా అభివర్ణిసుంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా చర్మవ్యాధుల, అతిసార, కండ్ల కలక, పచ్చకామెర్లు టైపాయిడ్‌, మలేరియా, డెంగూ వంటి భయంకరమైన వ్యాదులు వస్తాయి. ప్రజల జీవతాన్ని చిన్నాబిన్నం చేస్తాయి. ఈ వ్యాదుల నుంచి దూరంగా ఉండాలంటే ప్రజలు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అవేవంటే 1. బయటనుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. 2. వ్యక్తిగత శ్రద్దతో పాటు ఇంటిని ఇంటి చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 3. వేడివేడి ఆహార పదార్థాలను భుజించాలి.4)తినే పదార్థాలపైన ఈగలు, క్రీములు, కీటకాలు వాలకుండా మూతలు ఉంచాలి.
5)ఎక్కువ కాలం నిల్వఉంచిన ఆహార పదార్థాలు పాచిపోతాయి. అటువంటి నిల్వఉంచిన ఆహారపదార్థాలను తినకూడదు.6)త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలి.
7)అవసరమైతే నీటిని వేడిచేసి చల్లారిన తరువాత త్రాగాలి.
8)ఇంటిచుట్టు మురికినీరు నిల్వలేకుండా జాగ్రత్త వహించాలి.
9)బజారులో లభించే చిరుతిండ్లు తినకూడదు.
10)దోమల బారినుంచి రక్షణ పొందుటకు దోమతెరలు వాడాలి.
11)ఏమాత్రం జలుబు, తుమ్ములు వచ్చినా వైద్యుని సంప్రదించాలి.
12)సొంతవైద్యం జోలికి వెళ్ళకూడదు.
వర్షాకాలంలో వచ్చే వ్యాధులు వాటి కారణాలు నివారణ చర్యలు గురించి ఆంధ్రప్రభ డా,,కాశీనాథ్‌ను సంప్రదించగా ఆయన ఈ విధంగా తెలిపారు. టైఫాయిడ్‌ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీంతో జ్వరం, తలనొప్పి, మలబద్దకం, కీళ్ళనొప్పులు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అతిసారవ్యాధి ఇది కూడా బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వస్తుంది. దీంతో వాంతులు, విరోచనాలు, అవుతాయి.దీంతో మనిషి నీరసించిపోతాడు. మలేరియా, డెంగ్యూవ్యాధులు దోమల వల్ల వస్తాయి. దీంతో తీవ్రజ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. పచ్చకామెర్లు కలుషిత నీటిద్యారా వచ్చే రోగం దీంతో తలనొప్పి,

ఆకలి మందగించడం, కండ్లు, గోళ్ళు, చర్మం పచ్చగా మారుతోంది. ఈ వ్యాధులు బారిన ప్రజలు పడకుండా ఉండాలంటే వారు తమ వ్యక్తిగత శ్రద్దతో పాటు, పరిసరాల శుభ్రత పాటించినట్లయితే వ్యాధులబారిన పడకుండా ఆరోగ్య వంతంగా జీవించటానికి ఆస్కారముంటుందని ఆయన తెలియజేశారు.

No comments:

Post a Comment