- తీవ్రమైన చలిజ్వరంతో మొదలవుతుంది. తలనొప్పి, ఒంటినొప్పితో బాధపడతారు. లక్షణాలు ముఖ్యంగా మూడు దశలుగా గుర్తించవచ్చును.
- చలిదశ : చలి, వణుకు, తలనొప్పితో బాధలు మొదలు అవుతాయి. రోగి దుప్పట్లు కప్పుకొంటాడు.. ఈ విధంగా 15 ని.ల నుండి 1 గంటవరకు ఉంటుంది.
- వేడి దశ : శరీరమంతా మంటలతో తీవ్రమైన జ్వరం వచ్చును. తీవ్రమైన తలనొప్పి, వాంతి వికారములకు లోనవును. ఇది 2 నుండి 6 గంటల వరకు ఉండును. నాడి వాడిగా కొట్టుకుంటుంది. దప్పిక ఎక్కువ అవుతుంది.
- చెమటదశ : జ్వరం తగ్గుతుంది. చెమటలు పోస్తాయి. రోగికి నిద్ర కలుగుతుంది. తరువాత నీరసంగా వుంటుంది. ఇది 2 నుండి 4 గంటల వరకు ఉంటుంది.
- రోజు విడిచి రోజు జ్వరం వచ్చుట
- తలనొప్పి
- వంటినొప్పి
- వణుకుతో కూడిన చలి రావటం, మరియు చెమటలు
- వాంతులగుట
-
- రోగ కారణాలు
ప్లాస్ మోడియా వైవాక్స్
ప్లాస్ మోడియా ఫాల్సిపేరమ్
ప్లాస్ మోడియా ఓవేల్
ప్లాస్ మోడియా మలేరియా
ఈ జ్వరానికి కారణం – ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి. రోగి శరీరంలో ఈ సూక్ష్మజీవులుంటాయి. అనాఫిలిసం జాతికి చెందిన ఆడ దోమ ఈ రోగిని కుట్టి రక్తంతోపాటు సూక్ష్మ జీవులను కూడా పీల్చుకుంటుంది. అలాంటి దోమ ఇతర ఆరోగ్యవంతులను మళ్ళీ కుట్టినప్పుడు వారికి సంక్రమిస్తుంది. వారికి 10 – 15 రోజుల తరువాత జ్వరం వస్తుంది.
- తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష చేయించాలి. మలేరియా అని నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలి. రక్త పరీక్ష చేసే సదుపాయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లభిస్తుంది. దోమల ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుంది. కావున దోమలు పుట్టి పెరిగే స్థావరాలను అరికట్టాలి. నీరు నిలకడ ప్రదేశాలను పూడ్చి వేయాలి.
- ఇంటి పరిసరాలలో గుంతలు గోతులు లేకుండా జాగ్రత్త పడాలి.
- ఇంటి బయటపడుకునేవారికి దోమ తెర, వంటి నిండా బట్ట ఉంచుకోమని తెలియ చేయడం.
- వేపనూనె ఒంటికి రాసుకుంటే దోమ కుట్టదు.
- చిన్నచిన్న చెరువులు, గుంటలలో గంబూసియా లేక గప్పి చేపలు వదలడం.
- ఇంటిపై కప్పులో వున్న ట్యాంకులు (ఓవర్ హెడ్ ట్యాంకులు), నీటి కూలర్స్ మొదలగు నీటి తొట్లలో దోమలు పెరగకుండా చూసుకోవాలి.
- జూన్ – మలేరియా మాసం. ఈ నెలలో స్ర్పే జరిగిందా లేదా చూసుకోవాలి. గ్రామ పంచాయితీలో యాంటీ లార్వలం (దోమ పిల్లలను చంపుట) జరిగిందా లేదా చూసుకోవాలి.
- చలిజ్వరం కేసులున్నప్పుడు మలేరియా సిబ్బంది వచ్చి రక్తపరీక్ష చేయించడంలో సమన్వయం ఏర్పరచుకోవాలి.
-
- నియంత్రణకొరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు
జాతీయ మలేరియా కార్యక్రమం ద్వారా అన్ని జిల్లాలలో జిల్లా మలేరియా కార్యాలయాల ద్వారా 1,386 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు 10,562 ఉపకేంద్రాలలో సిబ్బంది నియమింపబడియున్నారు. ఇందులో 470 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోజుకు 24 గంటలు పని చేయునట్లుగా ఏర్పాటు చేయబడినది.
ఎవరైనా ఎలాంటి జ్వరంతోనైనా బాధపడుచున్నచో ఏలాంటి మందులు తీసుకోకముందు పైనుదహరించిన కేంద్రాలకు వెళ్ళి వ్యాధి నిర్థారణ కొరకు రక్త పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి నిర్థారణలో వచ్చిన జ్వరం మలేరియా మూలంగా అని తేలినచో, మలేరియా సిబ్బంది చికిత్స ప్రారంభిస్తారు. మలేరియా క్రిములున్న దోమ ఆరోగ్యవంతున్ని కుట్టినాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటకువచ్చును.
- గర్బిణీ స్త్రీలలో మలేరియా జ్వరం
- 3నెలలు లోపు గర్బిణీ స్త్రీకి మలేరియా జ్వరం ఉన్నదని నిర్దారించినట్లయితే మలేరియా జ్వరానికి సంబంధించిన మందులు వడరాదు.
- 3 నెలలు దాటిన తర్వాత డాక్టరు సలహా తీసుకొని మాత్రమే మలేరియా జ్వరం చికిత్స చేయించాలి.
- మెదడకు సోకే మలేరియా
- మలేరియా జ్వరంలో ప్రమాదకరమైనవి ప్రాణాంతకరమైనవి మెదడుకు సోకే మలేరియా
- ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనే మలేరియా క్రిమి ద్వారా ఈ మెదడకు వచ్చే మలేరియా జ్వరం వ్యాపిస్తుంది.
- ఈ మలేరియా జ్వరం వచ్చిన వ్యక్తులకు పిట్స్ కూడ సాధారణంగా వస్తుంది.
- ఈ రకమైన మలేరియాను సెర్కేల్ మలేరియా అంటారు.
- తీవ్రమైన స్దితిలో మరణం కూడా సంభ విచ్చవచ్చు.కాబట్టి ఆలస్యం చేయుకుండా వ్యాధి నిర్ధారణ చేయించి సరియైన చికిత్స చేయించడం వలన ప్రాణాపాయి స్ధితి నుండి కాపాడవచ్చును.
Sunday, October 13, 2013
మలేరియా లక్షణాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment