తల్లి బిడ్డకు జన్మనిచ్చిన 3వ రోజు,7వ
రోజు,14వ రోజు,21వ రోజు,28వ రోజు మరియు 42వ రోజు శిశువు
ఆరోగ్య పరిరక్షణ కోసం మొత్తం 6 సార్లు ఆరోగ్య కార్య కర్త మరియు ఆశ కార్యకర్త ఆ తల్లి
యొక్క ఇంటిని సందర్శించి మాత శిశు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ “హోం బేస్డ్ న్యూ
బోర్న్ కేర్” సేవలు అందించాలని చుక్కలూరు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.కౌసర్
బేగం గారు తెలియ చేసారు.
ఈ నెల 1 నుండి 30 వ తేది వరకు నిర్వహిస్తున్న “జాతీయ పోషకాహార మాసోత్సవాలలో భాగంగా
తాడిపత్రి మండలం లోని వెంకటాం పల్లి, తిమ్మేపల్లి గ్రామం లోని గర్బిణీ స్త్రీలకు మరియు పాలిచ్చు తల్లులకు
స్థానిక అంగన్వాడి కేంద్రం నందు పోషకాహారం,వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పైన
మహిళలకు ఆరోగ్య అవగాహన కార్య క్రమం నిర్వహించారు.
ప్రతి తల్లి కాన్పు అయున ఒక గంట
తరవాత శిశువుకు తల్లి పాలను ఇవ్వాలని తెలియచేసారు. తల్లి పాల వలన పిల్లలకు ఏడాది పాటు
వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందు తుందని తెలిపారు.పుట్టినప్పటి నుండి శిశువుకు
అందించవలిసిన వ్యాధి నిరోధక టీకాలు తల్లులు క్రమం తప్పకుండా ఇప్పించాలని కోరారు. శిశువు
6 నెలల తరువాత తల్లి పాలతో పాటుగా అదనపు పోషకాహారము ఇస్తూ శిశువుకు ఎటువంటి
అనారోగ్య సమస్యలు తలెత్త కుండా తగు జాగ్రత్తలు తీసుకొంటే పిల్లలు శారీరకంగా,మానసికంగా
దృడంగా పెరుగుతారని తెలియ చేసారు.
హోం బేస్డ్ యంగ్ చైల్డ్ కేర్ లో భాగంగా ఆశా
కార్య కర్తలు 3వ నెల,6వ నెల,9వ నెల,12వ నెల మరియు 15వ నెల మొత్తం 5 సార్లు శిశువుల
యొక్క గృహములు దర్శించి వారి ఆరోగ్య పరిస్థితి
గమనించి వారిలో రక్త హీనత,పోషకాహార లోప వ్యాధులు తలెత్తకుండా తగు సూచనలు
అందచేయాలని, ఎప్పటికప్పుడు వారి పెరుగుదల యందు లోపాలు గమనిస్తే ఆరోగ్య
కేంద్రములకు కేసులు రెఫెర్ చేయాలని కోరారు.
మహిళలు రక్త హీనత బారిన పడకుండా ఐరన్,విటమిన్స్,ప్రోటీన్స్ మరియు మినరల్స్ ఎక్కువగా లబించే ఆకు కూరలు,కాయగూరలు, పాలు,గ్రుడ్లు, మరియు
చేపలు, మాంసం
లాంటి ఆహార పదార్థాలు నిత్యం తీసుకోవాలని
సూచించారు.
ఈ కార్య క్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బాల
సూర్య నారాయణ, హెల్త్ సూపర్ వైసర్ కృష్ణ మోహన్, ఏపిఎంఒ బాల ఓబులు, ఆరోగ్య కార్యకర్త
విజయ లక్ష్మి , ఆశ కార్యకర్తలు రామలక్షమ్మ,
ఎల్లా దేవి,కృష్ణ వేణి మరియు అంగన్వాడి
కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment