Saturday, September 7, 2019


 జాతీయ నాణ్యత హామీ ధృవీకరణ పత్రం” కేంద్ర ప్రభుత్వం  నుండి పొందిన
చుక్కలూరుప్రాథమిక ఆరోగ్య కేంద్రం,అనంతపురం జిల్లా 
               అనంతపురం జిల్లాలో “జాతీయ నాణ్యత ప్రమాణాలు” పాటిస్తూ  పనిచేస్తున్న తొలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రముగా చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును గుర్తిస్తూ  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ,భారత ప్రభుత్వం వారు ఒక లేఖను విడుదల చేసారు. ఈ సందర్బంగా చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డా కౌసర్ బేగం మెడికల్ ఆఫీసర్ గారు  సిబ్బంది సమావేశం  నిర్వహించారు. నేషనల్ హెల్త్ మిషన్, అడిషనల్ సెక్రటరీ మరియు మిషన్ డైరెక్టర్  శ్రీ మనోజ్ జలాని గారు పై విషయం ధృవీకరిస్తూ  లేఖను పంపినట్లు చుక్కలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.కౌసర్ బేగం గారు మరియు డా. రెహన సుల్తానా గారు ఈ సమావేశములో  ప్రకటించారు.
               రాష్ట్రములో తొలిసారిగా నేషనల్ క్వాలిటీ అస్సెస్ మెంట్ పరీక్ష నిర్వహించుటకు  నియమించిన కేంద్ర ప్రభుత్వ  బృందములో   హర్యానా రాష్ట్రం నుండి డా. రీటా సింగ్ గారు,కేరళ రాష్ట్రం నుండి డా.శుభగన్ గారు సభ్యులుగా ఉన్నారు. చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ కొరకు ఈ బృందం  2019 మార్చి నెల 25 మరియు 26 తేదిలలో నాణ్యతా ప్రమాణముల తనికీ చుక్కలూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు   నిర్వహించారు.వాటి పలితాలు ఇప్పుడు ప్రకటిస్తూ లేఖను విడుదల చేసారు.  ఈ పరీక్షలో 90.3 స్కోరు సాదించి  జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న తొలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రముగా చుక్కలూరు ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.
          జాతీయ నాణ్యత హామీ ప్రమాణ పత్రం పొందిన సందర్బంగా సిబ్బందిని అభినందిస్తూ    అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి  డా .అనిల్ కుమార్ గారు సంతోషం వ్యక్త పరిచారు.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్య   సేవలు మరింతగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింప చేయాలనీ చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో పనిచేయు సిబ్బందిని ఆదేశించారు.
                 ఈ సమావేశములో  ఆరోగ్య విస్తరణ అధికారి బాల సూర్య నారాయణ, హెల్త్ సూపర్ వైసర్స్  కృష్ణ మోహన్,నారాయణ,లక్ష్మిదేవి, స్టాఫ్ నర్స్ లూర్దుకుమారి, ఆరోగ్య కార్య కర్త రామకుల్లాయమ్మ, ఏపిఎంఒ బాల ఓబులు, ల్యాబ్ టెక్నీషియన్ జ్యోతి,  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment