Friday, January 16, 2015

ఎంట్రీ లెవెల్ మరియు ఎగ్జిట్ లెవెల్ సమానం....కాని మద్యలో ఎందుకు తేడా? అని ప్రశ్నిస్తున్న మల్టీ పర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్....?

వైద్య ఆరోగ్య శాఖలో పురుషులు MPHA(M) గాను స్త్రీలు  MPHA(F) పోస్ట్ లో సమానమైన వేతన శ్రేణి లో జాయిన్ అవుతారు.తరువాత ఖాళీలను బట్టి కనీసం ౩ సంవత్సరముల సీనియారిటీ కల్గిన వారికి పురుషులకు MPHS(M) గాను స్త్రీలకు  MPHS(F) గాను సూపర్వైసర్ గా పదోన్నతి కల్పిస్తారు.ఈ క్యాడర్లో కూడా ఇరువరి జీతం స్కేల్ సమానంగా ఉంటుంది.తరువాత ఖాళీలను బట్టి కనీసం ౩ సంవత్సరముల సీనియారిటీ కల్గిన వారికి పురుషులకు MPHEO గాను స్త్రీలకు  PHN(NonTeaching)  గా పదోన్నతి కల్పిస్తారు.ఇక్కడ మాత్రమె ఇరువురి వేతన శ్రేణిలో రూ:2360-00 తేడాను పిఆర్సి కమిషన్ ప్రకటించింది.తరువాత ఖాళీలను బట్టి కనీసం ౩ సంవత్సరముల సీనియారిటీ కల్గిన వారికి పురుషులకు Community Health Officer (M) గాను స్త్రీలకు  Community Health Officer (F)  గా పదోన్నతి కల్పిస్తారు.తిరిగి ఇరువురికి సమాన వేతన స్కేల్ను  పిఆర్సి కమిషన్ ప్రకటించింది.MPHEO క్యాడర్ జరిగన వేతన తేడాను వెంటనే సవరించి PHN(NonTeaching) పోస్ట్ తో సమానంగా రూ 28940-78910 పే స్కేల్ ప్రకటించాలని అసోసియేషన్ సభ్యులు కోరుచున్నారు.

No comments:

Post a Comment