Saturday, September 7, 2019


 జాతీయ నాణ్యత హామీ ధృవీకరణ పత్రం” కేంద్ర ప్రభుత్వం  నుండి పొందిన
చుక్కలూరుప్రాథమిక ఆరోగ్య కేంద్రం,అనంతపురం జిల్లా 
               అనంతపురం జిల్లాలో “జాతీయ నాణ్యత ప్రమాణాలు” పాటిస్తూ  పనిచేస్తున్న తొలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రముగా చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును గుర్తిస్తూ  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ,భారత ప్రభుత్వం వారు ఒక లేఖను విడుదల చేసారు. ఈ సందర్బంగా చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డా కౌసర్ బేగం మెడికల్ ఆఫీసర్ గారు  సిబ్బంది సమావేశం  నిర్వహించారు. నేషనల్ హెల్త్ మిషన్, అడిషనల్ సెక్రటరీ మరియు మిషన్ డైరెక్టర్  శ్రీ మనోజ్ జలాని గారు పై విషయం ధృవీకరిస్తూ  లేఖను పంపినట్లు చుక్కలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.కౌసర్ బేగం గారు మరియు డా. రెహన సుల్తానా గారు ఈ సమావేశములో  ప్రకటించారు.
               రాష్ట్రములో తొలిసారిగా నేషనల్ క్వాలిటీ అస్సెస్ మెంట్ పరీక్ష నిర్వహించుటకు  నియమించిన కేంద్ర ప్రభుత్వ  బృందములో   హర్యానా రాష్ట్రం నుండి డా. రీటా సింగ్ గారు,కేరళ రాష్ట్రం నుండి డా.శుభగన్ గారు సభ్యులుగా ఉన్నారు. చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ కొరకు ఈ బృందం  2019 మార్చి నెల 25 మరియు 26 తేదిలలో నాణ్యతా ప్రమాణముల తనికీ చుక్కలూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు   నిర్వహించారు.వాటి పలితాలు ఇప్పుడు ప్రకటిస్తూ లేఖను విడుదల చేసారు.  ఈ పరీక్షలో 90.3 స్కోరు సాదించి  జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న తొలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రముగా చుక్కలూరు ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.
          జాతీయ నాణ్యత హామీ ప్రమాణ పత్రం పొందిన సందర్బంగా సిబ్బందిని అభినందిస్తూ    అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి  డా .అనిల్ కుమార్ గారు సంతోషం వ్యక్త పరిచారు.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్య   సేవలు మరింతగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింప చేయాలనీ చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో పనిచేయు సిబ్బందిని ఆదేశించారు.
                 ఈ సమావేశములో  ఆరోగ్య విస్తరణ అధికారి బాల సూర్య నారాయణ, హెల్త్ సూపర్ వైసర్స్  కృష్ణ మోహన్,నారాయణ,లక్ష్మిదేవి, స్టాఫ్ నర్స్ లూర్దుకుమారి, ఆరోగ్య కార్య కర్త రామకుల్లాయమ్మ, ఏపిఎంఒ బాల ఓబులు, ల్యాబ్ టెక్నీషియన్ జ్యోతి,  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Friday, September 6, 2019

మాత శిశు ఆరోగ్యం కోసం “జాతీయ పోషకాహార మాసోత్సవాలు” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చుక్కలూరు.


            

  తల్లి బిడ్డకు జన్మనిచ్చిన 3వ రోజు,7వ రోజు,14వ రోజు,21వ రోజు,28వ రోజు మరియు 42వ రోజు   శిశువు ఆరోగ్య పరిరక్షణ కోసం మొత్తం 6 సార్లు   ఆరోగ్య కార్య కర్త మరియు ఆశ కార్యకర్త ఆ తల్లి యొక్క ఇంటిని సందర్శించి మాత శిశు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ “హోం బేస్డ్ న్యూ బోర్న్ కేర్”  సేవలు అందించాలని   చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్  డా.కౌసర్ బేగం గారు తెలియ చేసారు.
              ఈ నెల 1 నుండి 30 వ తేది వరకు నిర్వహిస్తున్న  జాతీయ పోషకాహార మాసోత్సవాలలో భాగంగా తాడిపత్రి మండలం లోని వెంకటాం పల్లి, తిమ్మేపల్లి  గ్రామం లోని   గర్బిణీ స్త్రీలకు మరియు పాలిచ్చు తల్లులకు స్థానిక అంగన్వాడి కేంద్రం నందు   పోషకాహారం,వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పైన  మహిళలకు ఆరోగ్య   అవగాహన కార్య క్రమం నిర్వహించారు.  ప్రతి తల్లి కాన్పు అయున ఒక గంట తరవాత శిశువుకు తల్లి పాలను ఇవ్వాలని  తెలియచేసారు. తల్లి పాల వలన పిల్లలకు ఏడాది పాటు వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందు తుందని తెలిపారు.పుట్టినప్పటి నుండి శిశువుకు అందించవలిసిన వ్యాధి నిరోధక టీకాలు తల్లులు క్రమం తప్పకుండా ఇప్పించాలని కోరారు. శిశువు 6 నెలల తరువాత తల్లి పాలతో పాటుగా అదనపు పోషకాహారము ఇస్తూ శిశువుకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్త కుండా తగు జాగ్రత్తలు తీసుకొంటే పిల్లలు శారీరకంగా,మానసికంగా దృడంగా పెరుగుతారని తెలియ చేసారు.
              హోం బేస్డ్ యంగ్ చైల్డ్ కేర్ లో భాగంగా ఆశా కార్య కర్తలు 3వ నెల,6వ నెల,9వ నెల,12వ నెల మరియు 15వ నెల మొత్తం 5 సార్లు శిశువుల  యొక్క గృహములు దర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గమనించి వారిలో రక్త హీనత,పోషకాహార లోప వ్యాధులు తలెత్తకుండా తగు సూచనలు అందచేయాలని, ఎప్పటికప్పుడు వారి పెరుగుదల యందు లోపాలు గమనిస్తే   ఆరోగ్య కేంద్రములకు కేసులు రెఫెర్  చేయాలని కోరారు. మహిళలు రక్త హీనత బారిన పడకుండా ఐరన్,విటమిన్స్,ప్రోటీన్స్  మరియు మినరల్స్  ఎక్కువగా లబించే ఆకు కూరలు,కాయగూరలు, పాలు,గ్రుడ్లు, మరియు చేపలు, మాంసం లాంటి  ఆహార పదార్థాలు నిత్యం తీసుకోవాలని సూచించారు.
             ఈ కార్య క్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బాల సూర్య నారాయణ, హెల్త్ సూపర్ వైసర్ కృష్ణ మోహన్, ఏపిఎంఒ బాల ఓబులు, ఆరోగ్య కార్యకర్త విజయ లక్ష్మి ,  ఆశ కార్యకర్తలు రామలక్షమ్మ, ఎల్లా దేవి,కృష్ణ వేణి  మరియు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Sunday, July 30, 2017

అందరి లోను ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అంటే తనను తాను నిందించు కొన్నట్లే అవుతుంది !!! ~భగవద్గీత.


Monday, July 24, 2017

చంద్రన్న సంచార చికిత్స వాహన సిబ్బంది తో బడి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు!!! పేషెంట్ కు ఆపద వస్తే 108 కు కాల్ చేసి సమీప ఆసుపత్రిలో చికిత్సను పొందే ఆవకాశం ఉంది.కాని PHC లో పని చేసే వైద్యులు అత్యవసరంగా ఇతర గ్రామాలకు వెళ్లి చికిత్సలు అందచేయాలంటే సరైన వాహనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.మహిళా వైద్యులు అంటువ్యాధులు ప్రబలి నప్పుడు గ్రామాల్లో వైద్య శిభిరాలు నిర్వహించాలి అంటే చాల కష్టంగా ఉంది.బడి పిల్లలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించుటకు మండలము లోని అన్ని గ్రామీణ పాటశాలలు విసిట్ చేయాలంటే ప్రభుత్వం వారికి తక్షణం వాహన సౌకర్యం కల్పించ వలిసిందే.ఇతర శాఖల సిబ్బందికి వాహన సౌకర్యం కల్పించిన ప్రభుత్వం అతి త్వరగా వైద్య ఆరోగ్య శాఖ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రములకు కూడా వాహన వసతి కల్పించాలని ప్రభుత్వ వైద్యులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నారు.అలాగే 104 మొబైల్ వాహనం విసిట్ చేసే గ్రామాల్లో బడి పిల్లలకు RBSK పథకము క్రింద అన్ని పరీక్షలు నిర్వహించే టట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది


బడి పిల్లల మధ్యాహ్నం భోజనము

 తనికీ చేస్తున్న దృశ్యం !!! 

Wednesday, July 19, 2017

MR vaccine posters విడుదల చేసిన మన ముఖ్యమంత్రి గారు !!!!

MR వాక్సినేషన్ కార్యక్రమములో ఉపాద్యాయుల పాత్ర !!!
Measles is a deadly disease and one of the main causes behind child mortality in the country. It is highly contagious and spreads through coughing and sneezing. Globally, in 2015, measles killed an estimated 1,34,200 children, mostly under the age of five years. In India, it killed an estimated 49,200 children. Rubella is generally a mild infection, but has serious consequences if infection occurs in pregnant women, causing congenital rubella syndrome, which is a cause of public health concern. Currently, Measles vaccine is provided under Universal Immunisation Programme. Rubella vaccine will be a new addition.