Wednesday, January 14, 2015

పోలియోగా పిలువబడే పోలియోమైలిటిస్‌ వైరస్‌ గురించిన సమాచారం.

పోలియోగా పిలువబడే పోలియోమైలిటిస్‌ వైరస్‌ గురించిన సమాచారం.
 స్పెషల్‌స్టోరీ- ఇది ఒక అంటువ్యాధి.
- అనాదిగా మానవులను పట్టిపీడించింది.
- 1900 శతాబ్దం మొదటి అర్థభాగంలో ఈ వ్యాధి వికృతరూపం దాల్చింది.
- ఆ తరువాతే పోలియో వ్యాక్సిన్‌ను జోనస్‌ సాక్‌ కనుగొన్నారు.
- 1955లో అందరికీ ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది.
- 1952లో పోలియో విజృంభించడంతో 60 వేల కేసులు నమోదయ్యాయి.
- ఒక్క అమెరికా దేశంలోనే 3 వేల మరణాలు సంభవించాయి.
-పాశ్చాత్య దేశాలలో 20వ శతాబ్దం రెండవ అర్థభాగంలో
 పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
విస్తృతంగా పోలియో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా 1979లో అమెరికాలో, 1991లో పాశ్చాత్య దేశాలన్నింటిలో పోలియో పేరు వినిపించకుండా చేశారు.
గుర్తులు, లక్షణాలు
- దాదాపు 95 శాతం కేసులలో లక్షణాలంటూ పెద్దగా ఏవీ కనిపించవు. ఇటువంటి దానిని లక్షణాలు లేని పోలియోగా పిలుస్తారు. 4 నుంచి 8 శాతం కేసులలో అనారోగ్యం మూడు రకాలుగా కనిపిస్తుంది. ఈ రకాన్ని లక్షణాలు గల పోలియోగా పిలుస్తారు.
1. చాలా స్వల్పంగా కనిపించే అబోర్టివ్‌ పోలియో. ఈ రకమైన పోలియో రుగ్మతలు పెద్దగా కనిపించవు. ఫ్లూలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌, అతిసార, జ్వరం, గొంతులో మంట వంటి లక్షణాలతో సాధార ణంగా ఏదో అనారోగ్యానికి గురైనట్లు అని పస్తుందే తప్ప అసలు పోలియో వచ్చిందేమో అని అనుమానిం చడానికి ఆస్కారమే ఉండదు.
2. ఆ తరువాతి స్థాయి... నాన్‌ పెరలిటిక్‌ పోలియో. 1 నుంచి 5 శాతం మందిలో నరాలకు సంబంధించిన లక్షణాలు అంటే, వెలుతురు చూడలేకపోవడం, మెడ పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
3. చివరిది... పెరలిటిక్‌ పోలియో. 0.1 శాతం నుంచి 2 శాతం కేసులలో ఈ పోలియోను గుర్తిస్తారు. అబోర్టివ్‌ పోలియో, నాన్‌ పెరలిటిక్‌ పోలియో సంభవిస్తే పూర్తిగా నయం అవుతాయి. పెరలిటిక్‌ పోలియో సంభవిస్తే దాని పేరుకు తగినట్లుగానే కండరాలు బిగుసుకుపోతాయి, కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవిస్తుంది.
పెరలిటిక్‌ పోలియోలో వైరస్‌ ప్రేవులను వదలి రక్తప్రవాహంలో కలుస్తుంది. నరాలపై దుష్ప్రభావం చూపుతుంది. అంతేకాదు, అవయవాల కదలికలకు, ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలకు అవసరమైన కండరాలను నియంత్రించే నరాలను వాటి పని అవి చేయకుండా చేసేస్తుంది. ఫలితంగా కాళ్ళు, చేతులు పడిపోయి ఊపిరి ఆడని పరిస్థితితో విలవిలలాడి చివరకు ప్రాణాలు సైతం కోల్పోయే సరిస్థితి తీసుకువస్తుంది. మిగతా రకాల పోలియో వ్యాధులలో వైరస్‌ ప్రేవులకే పరిమితం అవుతుంది.
ఎలా అంటుకుంటుంది?
పోలియో వైరస్‌ను మల పరీక్షలో కనుగొన్నారు. మరుగు దొడ్లకు వెళ్ళి వచ్చిన తరువాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోకపోయినా, కలుషిత నీరు తాగినా ఈ వ్యాధి అంటు కోవడాన్ని గుర్తించారు.
నివారణ
- పిల్లలకు 2 నెలల నుంచి 6 ఏళ్ళలోపు ఇనాక్టివేటెడ్‌ పోలియో వాక్సినేషన్‌ (ఐపివి) నాలుగు మోతాదులలో
ఇవ్వవలసి ఉంటుంది.
- 1964 నాటికి, ఓరల్‌ పోలియో వ్యాక్సీన్‌ (ఒ.పి.వి.)ను ఆల్బర్ట్‌ సాబిన్‌ అభివృద్ధి పరిచారు.
- ఈ వ్యాక్సీన్‌ను పిల్లలకు అందించడం అత్యంత సులభం కాబట్టి, ఈ వ్యాక్సీన్‌కు విస్తృతంగా ప్రచారం
జరిగింది.
- శరీరంలో యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా పోలియో వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని ఐ.పి.వి. శరీరానికి అందిస్తుంది.
- ప్రస్తుతం అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ (ఎఎపి) సిఫార్సు ప్రకారం, 18 నెలలలోపు ఐ.పి.వి.ని మూడు మోతాదులు, 4 నుంచి 6 ఏళ్ళ మధ్యలో ఐ.పి.వి. బూస్టర్‌ను ఇవ్వాలి.
వ్యాధి ఎంతకాలం ఉంటుంది?
- తీవ్ర పోలియో రుగ్మత రెండు వారాలకంటే తక్కువ కాలమే ఉంటుంది కానీ, నరాలకు కలిగే నష్టాన్ని మాత్రం జీవితాంతం భరించవలసిందే.
- గతంలో పోలియో వ్యాధిన పడినవారు వారి కాళ్ళు, చేతులను పూర్తి స్థాయిలో ఉపయోగించు కోలేకపోయారు.
- పోలియో బారి నుంచి బయట పడినప్పటికీ ఆ తరువాత 30 నుంచి 40 ఏళ్ళపాటు పోస్ట్‌-పోలియో సిండ్రోమ్‌ (పిపిఎస్‌) కోరల్లో చిక్కుకున్నారు.
- అంటే... ఒకవిధమైన బలహీనత వారిని వెంటాడింది.
చికిత్స
- పోలియో వ్యాధి విపరీతంగా దాడి చేసినప్పుడు, ప్రామాణిక చికిత్స ఎలా ఉంటుందంటే... 'ఐరన్‌ లంగ్‌' ద్వారా ముందుగా వారికి ఊపిరి సక్రమంగా జరిగేలా చూస్తారు.
- ఈ 'ఐరన్‌ లంగ్‌' అనేది ఒక పెద్ద యంత్రం.
- ఇది, ఛాతీ కండరాలను ముందు కు, వెనుకకు కదిలిం చి అవి పని చేసేలా చూస్తుంది.
- అయితే అప్పటికే పాడైపోయిన కాళ్ళు, చేతులను మాత్రం కదల్చడానికి ఉండదు.
- పోలియో సమస్యను ఇప్పటికీ ఎదుర్కొంటున్న కొన్ని దేశాలలో వెంటిలేటర్లు, ఐరన్‌ లంగ్స్‌ను ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు.
- సాధారణ పోలియో అయితే మాత్రం ద్రావకాలను సాధ్యమై నంత ఎక్కువ ఇవ్వడం, పూర్తి విశ్రాంతి ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
పోలియో భవిష్యత్తు
ప్రపంచవ్యాప్తం గా పోలి యా వ్యాధి ని నిర్మూ లించడాని కి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఒ.) తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్ప టికే అనేక రకాలు గా ఈ దిశగా విజయాలు సాధించింది. 125 దేశాలలో 1988లో 355,000 కేసులు నమోదు కాగా, 2004లో కేవలం 1,255 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఆఫ్ఘనిస్థాన్‌, ఈజిప్టు, ఇండియా, నైజర్‌, నైజీరియా, పాకస్థాన్‌ దేశాలలో ఇప్పటికీ పోలియో వ్యాధి తన ఉనికిని చాటుకుంటోంది. మరికొన్ని దేశాలకు కూడా ఈ వైరస్‌ పాకే ప్రమాదం లేకపోలేదు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు వ్యాధి ఇలాగే విస్తరించింది. కాబట్టి ఈ పోలియో మహ మ్మారి బారిన పడకుండా ఉండాలంటే దానిని అంతం చేయడం ఒక్కటే మార్గం.

No comments:

Post a Comment